Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా నాయకులు చిర్ర వెంకన్న గౌడ్
నవతెలంగాణ-నెల్లికుదురు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించిన బస్తాలను పిల్లలకు పంపించడం లో అధికారులు లారీలను పంపించడంలో పూర్తిగా విఫలం చెందారని సీపీఐ జిల్లా నాయకులు చిర్రా వెంకన్న గౌడ్, మండల సహాయ కార్యదర్శి బైసా స్వామి అన్నారు. మండలంలోని శ్రీరామగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని మొనగాల వీడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ నాయకులు రైతు లతో కలిసి సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకునే కార్యక్రమం నిర్వ హించిన అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆరుగాలంకరించి పండించిన పంట అమ్ముకుందామని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి తీసుకువచ్చి సుమారు 15 రోజులు దాటిందని వాటిని నిర్వహకులు కాంటాలు ప్రారంభించారని కాంటాలు నిర్వహించిన బస్తాలను లారీలలో మిల్లర్లకు పంపియాలని నిబంధన ఉన్నప్పటికీ నిర్వాహకులు లారీలు రాట్లేవని కాంటాలు నిర్వహించిన బస్తాలను కూడా సుమా రు 10 రోజుల నుంచి అక్కడే నిల్వ ఉంచారన్నారు. దీంతో రైతులు ఇటీవల కురు స్తున్న వర్షాలకు పండించిన ధాన్యం కాంటాలు పెట్టిన బస్తాలు తడిసి ముద్ద అవు తున్నాయని దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతాంగం నష్ట పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటాలు పెట్టిన బస్తాలను పంపించడంలో లారీలు రాకనే పంపిస్తలేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. లారీలు పంపించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తీసుకొ చ్చిన ధాన్యాన్ని మ్యాచ్ ఎవరు వచ్చిందా..? రాలేదా..? అని అధికారులు చూస్తు న్నారని ధాన్య కొనుగోలు కేంద్రంలో అధికారులు చూసి ఏ గ్రేడ్ కింద కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కానీ అటు ధాన్యం మిల్లర్లకు తరలించగా మిల్లర్లలో ఏ గ్రేడ్‌గా పంపించిన ధాన్యాన్ని సీ గ్రేడ్‌గా మిల్లర్లు రాసి ధాన్యం కట్ చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కొనుగోలు కేంద్రంలో చూసి అధికారులే కదా అయినప్పటికీ మిల్లర్‌లో ఎందుకు సీక్రెట్ వేస్తున్నారని అధికారులు ఎందుకు అడగట్లేదు అని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఇక్కడ కొనుగోలు చేసిన ధాన్యం ఏ గ్రేడ్ అయితే ఉంటుందో అదే గ్రేడులో దిగుమతి కూడా చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే లారీలను ఆయా కొనుగోలు కేంద్రాల్లోకి అధికారులు ప్రభుత్వం పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు వెంకట్ రెడ్డి, రైతులు జక్కుల అజయ్, ఎండి అఫ్జల్, బొట్టే మురళి, కమల, బోయిన రాజన్న, దుస్స వీరయ్య, కన్నా లింగయ్య, ఎండి సైదులు తదితరులు పాల్గొన్నారు.