Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నల్లపు సుధాకర్ డిమాండ్
నవతెలంగాణ-మహబూబాబాద్
వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బుధవారం రైతు సంఘం అధ్వ ర్యంలో నిరసన వ్య క్తం చేశారు. కురవి మండలంలోని కందికొండ గ్రామంలో పిఎసిఎస్ కాంపెల్లి వారు, కందికొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లో గత 15 రోజుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నల్లపు సుధాకర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం ఆరబోసే క్రమంలో కోతులు విపరీతంగా వస్తున్నాయని, అవి ధాన్యాన్ని ఎక్కడికి అక్కడ చెల్లాచెదురు చేస్తున్నాయని, దీంతో రైతులు కోతులను తరుమలేక ఓ మహిళ రైతు ఎండలో సొమ్మసిల్లి పడిపోయిందని అన్నారు. కావున రైతుల జీవితాలతో ఆడుకోకుండా సంబంధిత అధికారులు చొరవ చూపి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నా యకులు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలోజాటోత్ ఎంకన్న, ఎవరు నెహ్రూ, నల్లపూ పోచయ్య, వీరమ్మ,నర్సయ్య,వెంకటమ్మ పాల్గొన్నారు.