Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
విశ్వేశ్వర సర్వీస్స్టేషన్ హిందుస్థాన్పెట్రోలి యం,లష్కర్బజార్హనుమకొండలోనిపెట్రోల్ బంక్లో గత 30 ఏళ్ల పైబడి పనిచేస్తున్న కార్మికులను ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా 4, రోజు క్రితం కార్మికులను పని నుండి తొలగించడంతో తిరిగి పనిలోకి తీసుకోవాలని సిఐటియూ, తొలగిం చిన కార్మికుల ఆధ్వర్యంలో విశ్వేశ్వర పెట్రోల్ బంకు, లష్కర్ బజార్లో బుధవారం మధ్యాహ్నం 1గంటకు రోడ్లు ఊడుస్తూ కార్మికులు నిరసన కార్యక్రమం చేప ట్టడం జరిగింది. అనంతరం సీఐటీయూ హనుమ కొండ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి మా ట్లాడుతూ గత 30ఏళ్ల నుండి పెట్రోల్ బంకులో పని చేస్తున్న కార్మికులను యజమాన్యం వారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా లీజు పేరుమీద అక్రమంగా 20మంది కార్మికులను పని నుండి తొలగించడం అ న్యామని నాలుగు రోజుల నుండి కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవాలని నిర సన కార్యక్రమాలు చేస్తున్న బుధవారం వరకుయజ మాన్యం వారు స్పందించక పోవడం దురదృష్టకరమ న్నారు. కార్మికులు ఈ వత్తి మీదనే ఆధారపడి వారి కు టుంబాలు జీవనం కొనసా గిస్తున్నారని ఆకస్మాత్తుగా కార్మికులను తొలగించడం వల్ల వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల గురయ్య పరిస్థితి ఉందని తొలగించిన కార్మికులను వెంటనే యాజమాన్యం పనిలోకి తీసుకోవాలని కార్మికుల, య జమాన్యం మధ్య జరిగే వేతన ఒప్పందం అమలు చే యాలని వారిని గతంలో పనిచేసిన యథాస్థితిలో పని చేయించుకోవాలని యజమాన్యానికి ఆయన విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో సిఐటియూ, సహాయ కార్యద ర్శి బొల్లారం సంపత్, యూనియన్ ప్రధాన కార్యదర్శి మంద యాకనారాయణ, కే.కొమురయ్య, బుర్ర గోవర్ధన్, కే.దయానంద్,కే.శ్రీనివాస్, బి.సతీష్, వెంక టేశ్వర్లు, ఎండి.మోహిన్, ఎం.వెంకటేష్, ఏం.రమ, టి.విజయ, దొడ్డిపాకభద్రయ్య, రచన, రేవంత్, రంజి త్, విజయలక్ష్మి, సరళ, కార్మికులు పాల్గొన్నారు.