Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా హాజరైన టీడీపీ నాయకులు,పార్టీ శ్రేణులు
నవతెలంగాణ - ములుగు
మహబుబాబాద్ పార్లమెంటరీ మినీ మహానాడును ములుగు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర నాయకుడు కసాని సాయి, కూరపాటి వెంకటే శ్వర్లు, ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జి కొండపల్లి చందర్రావు, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఇంఛార్జి ఏర్ల వెంకన్న మాట్లా డుతూ ఇటీవల కురిసిన వడగండ్ల వాన వలన పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎక రాకు 30వేల రూపాయలు తమ ఖాతాలో జమ చేయాలని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పంట నష్టాపరిహా రం అందించాలన్నారు. టిఎస్పిఎస్సీ ప్రశ్నప త్రాల లీకేజీలో బాధ్యులను గుర్తించి చట్టపర మైన చర్యలు తీసుకోవాలన్నారు. కెసిఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ములుగు జిల్లాలో టిడిపి పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తామని అన్నా రు. పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభి లాషులు కష్టపడి ములుగు జిల్లాలో టిడిపి జెండా ఎగిరేల కషి చేయాలన్నారు. మహా నాడుకు తరలివచ్చి విజయవంతం చేసిన నాయకులకు,కార్యకర్తలకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాం, పార్టీ రాష్ట్ర కల్చరల్ అధ్యక్షుడు చంద్రహాస్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, పినపాక నియోజకవర్గం ఇంచార్జ్ మాధవి లత, మహబూబాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ భూక్య సునీత, రాష్ట్ర నాయకుడు రాజు నాయక్ పాల్గొన్నారు.