Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
ఇరుకు రోడ్డు అటు ఇటు బంటాలు ముళ్ళపోదలు మూల మలుపు ప్రయాణానికి అడ్డుగా ప్రమాదకరంగా కరెంటు స్తం భం ఉండడంతో వాహనదారు లు భయంతో ప్రయాణం చేస్తున్నారు. మండల కేంద్రం నుండి పగిడిపల్లి, గుం డం రాజుపల్లి మీదిగా నెల్లికుదురు, తొర్రూర్ వెళ్లేందుకు వాహనదారులు వెళ్తా రు. ముళ్ళ పోదలు ఉండడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడంతో కరెంటు స్తంభం ఉండడంతో కూడ అధిక సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికైనా ఆర్అండ్బి అధికారులు ఇరువైపులా రోడ్డుకు ఉన్న ముళ్ల పోదాలను తొలగించాలి. విద్యుత్ అధికారులు వెంటనే కరెంటు స్తంభాన్ని తొల గించి వేరే చోట వేయాలని వాహనా దారులు కోరుచున్నారు.