Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యురాలు జడల రాజేశ్వరి
నవతెలంగాణ-భూపాలపల్లి
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని సభ్యురాలు జడల రాజేశ్వరి డిమాండ్ చేశారు గురువారం జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో జరిగిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల స మావేశానికి రాజేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్క రించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన వసతి గహాలను వెంటనే ప్రారంభించా లని కోరారు. ఐటిఐ కళాశాలకు కేటాయించిన భ వనాన్ని ప్రగతి భవనం కేటాయించడం వల్ల విద్యా ర్థులకు సొంత భవనం లేక అద్దె భవనాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భూపాలపల్లిలో పీజీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలని అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు ఎస్.కె చోటు, ఎండి హీన, బాణాల నాగమణి, బాణాల లలిత, అముదాపురం వైష్ణవి, గడ్డం స్వరూప, పొన్నగంటి లావణ్య తదితరులు పాల్గొన్నారు.