Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తాడ్వాయి
పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్న కారణంగా గ్రామాలలో పారిశుధ్యం పేరుకుపో తున్న దృష్ట్యా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామా లలో తాత్కాలిక సెక్రటరీలుగా ఇతర విభాగాల ఉద్యోగులను అలాట్ చేస్తున్నట్లు మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక తాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్ తో కలిసి స్థానిక ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అధ్యక్ష తన మండలస్థాయి అధికారులతో అత్యవసర స మావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ మండలంలో 18 గ్రామ పంచాయతీల గాను 11మంది ఇతర విభాగాల ఉద్యోగులను వివిధ గ్రామపంచాయతీలకు తాత్కాలిక సెక్రటరీలుగా బాధ్యతలు అప్పగించి నట్లు తెలిపారు. రేపటి నుండి గ్రామపంచాయతీ లో వారి విధులతో పాటు గ్రామపంచాయతీలో ఏ సమస్య అయినా ముఖ్యంగా శానిటేషన్ పనులను ఇబ్బందులేకుండా నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. ఈ తాత్కాలిక బాధ్యతలు ప్రభుత్వం నిర్ణయం మేరకు మండల కమిటీ ఏర్పాటు చేసి నిర్వర్తించడం జరి గిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, ఎంపీఓ శ్రీధర్, ఇతర శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.