Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
అకాల వర్షాలు, గాలి దుమారాలతో తడిసిన,రంగు మారిన,మొలకెత్తిన వరి, మిర్చి పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య డిమాండ్ చేశారు గురు వారం మండలంలోని ఎడ్లపల్లి, కొయ్యుర్ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇటీవల మండలంలో వరుసగా కురుస్తున్న అకాల వర్షాలకు అరబోసిన వరి, మిర్చి వరదల్లో కొట్టు కుపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.వడగండ్ల వాన,గాలి దూమరంతో నెలమట్టమైన ఇండ్లు,ఇంటి గోడలకు అధికారులు సర్వేలు నిర్వహిం నష్టపరిహారం అందిం చాలన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఆందోళ నలు, రాస్తోరోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనగామ స్వరూప బాపు, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ సంగ్గెం రమేష్, రైతులు పాల్గొన్నారు.