Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలంలోని మోట్లపల్లి జడ్పీ హైస్కూల్ కు చెందిన జంగా సుశాంత్ యాగ విజరు షూటింగ్ బాల్ క్రీడా విభాగంలో జాతీ యస్థాయికి ఎంపికైనట్లు జిల్లా షూటింగ్ బాల్ ప్రధాన కార్యదర్శి గుండెల్లి రాజయ్య తెలిపారు. ఇటీవల నారాయణపేట జిల్లాలోని మక్తల్ మినీ స్టేడియంలో నిర్వహించిన 42వ రాష్ట్రస్థాయి షఉటింగ్ క్రీడలో సుశాంత్ విజరు లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ఈనెల 25 నుంచి 27వ తేదీలో ఉత్తరప్ర దేశ్‌లోని వారణాసిలో జరుగు జాతీయ క్రీడా పోటీలో తెలంగాణ జట్టు తరఫున పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు స్థానిక సర్పంచి నరహరి పద్మ వెంకటరెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ గోపాల్ రెడ్డి, కుమార్ ఆర్థిక సహాయం అందించి అభినందించారు.