Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తరిగొప్పుల
మండల పరిధి లోని జాలుబారు తండా,పంతులు తండా, మాన్సింగ్ తండా లలో లోడి సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మనొస్ యునిదాస్ వారి సహకారంతో లోడి సంస్థ డైరెక్టర్ విజయ పాల్ రెడ్డి ఆదేశానుసారం గురువారం చేరువు పూడికతీత కార్యక్ర మం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో చెరువులో నీరు నిలువ ఉండక పోవడం వల్ల నీటి ఎత్తడి ఏర్పడుతుందని కావున రాబోవు కాలంలో ఎలాంటి నీటి ఎత్తడి ఏర్పడకుండా చెరువులో పూడికతీత పనులను ప్రారంభించా మన్నారు. దీంతో భూగర్బా జలాలు పెరిగి బావుల్లో నీరు సమద్ధిగా లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కొడం, సత్య నారాయణ, రవీందర్, బిచ్చ, తిరుమల, రమేష్ తదితరులు పాల్గొన్నారు.