Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశాలున్నట్లు బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతుంది. వరంగల్ పార్లమెంటు ని యోజకవర్గం పరిధిలో స్టేషన్‌ఘన్‌పూర్, భువనగిరి నియో జకవర్గం పరిధి జనగామ, మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మా ర్పులు జరిగే పరిస్థితి వుందని ప్రచారం జరుగుతుంది. సిఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే మళ్లీ పార్టీ టికెట్ లు ఇవ్వనున్నట్లు ప్రకటించాక తాజాగా జరిగిన రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో సిట్టింగ్‌లకు సీఎం గట్టి వార్నింగ్ ఇచ్చారు. దళితబంధు పథకంలో అవినీతికి పాల్పడుతున్నారని, చిట్టా తన వద్ద వుందని, సరిచేసుకోక పోతే తోక కత్తిరిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సిట్టింగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో మార్చే అవకాశముందన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతుంది. ఇటీవల సీఎం కేసీఆర్ రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావే శంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన హెచ్చరికలతో వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 4 నియోజకవర్గా ల్లో ప్రధానంగా సిట్టింగ్‌ల మార్పుపై చర్చ జరుగుతుంది. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై పార్టీ శ్రేణుల్లో బహిరంగంగానే చర్చ కొనసాగుతుంది. ప్రత్యామ్నాయ నేతలు సైతం ఈ నియోజకవర్గాల్లో తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడం గమనార్హం.
సిట్టింగుల్లో ఆందోళన
వచ్చే శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్ సాధించే విషయంలో పలు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయ నేతలు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు షాక్‌కు గురిచేస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ఇటీవల బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు తెర వెనుక పరిణామాలకు అద్దం పడుతున్నాయి. ఇదే క్రమంలో సీఎం పోటీ చేసే అవకాశమిస్తే డోర్నకల్ నుండే పోటీ చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ సైతం ఆత్మీయులతో జరిగిన సమా వేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా వుంటే మహ బూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌పై ఆరోపణలు న్నాయి. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వస్తున్న విమర్శల నేపథ్యం లో పార్టీ అధిష్టానం సైతం ఆయనపై సీరియస్‌గా వున్నట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్‌ను ఎంపి మాలోత్ కవిత ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీల మధ్య తీవ్ర విభేధాలున్నాయి. బిఆర్ఎస్ జిల్లా అధ్య క్షురాలిగా వున్న ఎంపి కవిత తన సీటుకే ఎసరుపెడు తుందని భావించిన ఎమ్మెల్యే, ఎంపిని లక్ష్యంగా చేసుకొని పలుమార్లు వ్యాఖ్యలు చేయడం, ఒక సమావేశంలో సైతం ఎంపి చేతిలో నుండి మైక్ లాక్కొని మాట్లాడిన సందర్భ ముంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండే పోటీ చేయాలని ఎంపి కవిత గట్టి ప్రయత్నం చేస్తుంది. జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి నియోజకవర్గంలో సీనియర్ నేతలు వ్యతిరేకవర్గంగా ఏర్పడ్డారు. సొంత కుటుంబసభ్యులు సైతం 'ముత్తిరెడ్డి'పై ఆరోపణలు చేయడంతో ఆయన పరిస్థితి గం దరగోళంగా మారింది. ఇదిలావుంటే జనగామ నియోజక వర్గం నుండి వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తితో వు న్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ ఆర్కు సన్నిహితుడైన 'పోచంపల్లి' ఇప్పటికే నియోజక వర్గంలో 'ముత్తిరెడ్డి' వ్యతిరేకులను చేరతీసి తన కార్యక్ర మాలను ముమ్మరం చేశారు. ఇదిలావుంటే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వివాదాస్పదుడిగా మారాడు. ఈ నియోజక వర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పార్టీ టికెట్నాశిస్తున్నారు. వరుస వివాదాలతో 'తాటికొండ'పై ప్రజల్లో వ్యతిరేకత వున్న పార్టీ నాయకత్వం మాత్రం ఆయన్ను విధేయత కలిగిన నాయకుడిగా పరిగణిస్తూ వస్తుంది. తాజాగా సీఎం కేసీఆర్ పార్టీ సమావేశంలో దళితబంధులో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, ఇప్పటికేనా పద్దతి మార్చుకోవాలని లేదంటే తోకలు కత్తిరిస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాం శంగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో దళిత బంధు పథకంలో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు న్నాయి. ఈ క్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌లో అభ్యర్థిని మార్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఈ నాలుగు నియోజకవర్గాలతోపాటు మరో రెండు నియోజకవర్గాల్లో ఇదే చర్చ జరుగుతున్నా ప్రత్యా మ్నాయ నేతలు బలంగా లేకపోవడంతో మార్చే పరిస్థితి వుండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.