Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ సురేందర్ రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
మావోయిస్టులకు డబ్బులు, సామాగ్రిని తరలిస్తున్న నలుగురిని భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 78లక్షల 57000 వేల రూపాయలను స్వాధీ నం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ సురేందర్ రెడ్డి జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఈనెల 10న సాయంత్రం 5గంటలకు కాటారం పోలీసులు మహాదేవపూర్ రోడ్డులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీలు నిర్వహిస్తుం డగా స్కార్పియో వాహనం అనుమానాస్పందంగా 78 లక్షల 57000 వేల రూపాయలతో వస్తు సామగ్రి కనిపించడంతో తనిఖీ చేశారు. హెచ్ట్యాబ్, మందులు, సిరప్ సీసాలు, క్యాసియో వాచీలు, న్యూట్రిషన్ పౌడర్, జెలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్, వైట్ టవల్స్ కనిపిం చడంతో నలుగురిని అదుపులోకి విచారించడంతో మావోయిస్టులకు డబ్బులు, సామాగ్రిని చేరవే సేందుకు వెళ్తున్న విషయాన్ని నిందితులు నిర్ధారిం చినట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో ఏ1 అబ్దుల్ అజీజ్, ఏ2. మొహమ్మద్ అబ్దుల్ రజాక్, ఏ3 జనగామ రాఘవ్, ఏ4. కౌసర్ అలీ ఉన్నారు. కరీంనగర్‌కు చెందిన అజీజ్ కొన్ని సంవత్సరాలుగా చత్తీస్‌ఘడ్‌లో బీడీ లీఫ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అజీజ్ సొదరుడు మొహమ్మద్ అబ్దుల్ రజాక్ కుడా ఆయనతో పాటు ఉంటున్నాడు. బీజాపూర్ భూపాల పట్టణం తాలూకాకు చెందిన జనగామ రాఘవ్ అజీజ్‌కు గుమాస్తాగా పనిచేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కౌసర్ అలీ అజీజ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
అసలేం జరిగిందంటే..?
అజీజ్ చత్తీస్గడ్ లోని భూపాలపట్నంలో బీడీ లీఫ్ మేనేజర్‌గా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తు న్నాడు. ఈ క్రమంలోనే అత్రం నారాయణ అనే స్థాని కుడి ద్వారా మావోయిస్టులు వర్గీస్, భాస్కర్, దిలీప్ ఉంగ, వెళ్లాలు పరిచయమయ్యారు. 2014 సంవ త్సరం నుంచి అజీజ్ ప్రతి సంవత్సరం మావోయిస్టు పార్టీ నాయకులను కలవడం జరుగుతుంది. వారికి ఎలాంటి అవసరాలున్నా అజీజ్‌కు మెసేజ్ వచ్చేది. అజీజ్ నారాయణ, మారుపాక రామయ్యల ద్వారా మావోయిస్టులకు వస్తువులను చేరవేస్తుంటాడు. 2022లో అజీజ్ మంచిర్యాల్‌కు చెందిన రవూఫ్ పేరు మీద కాంట్రాక్టు తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఈమేరకు కొద్దిరోజుల క్రితమే మావోయిస్టులకు 13 లక్షలు పార్టీఫండ్ కింద అందజేశాడు. కరీంనగర్లో కొన్ని వస్తువులను కొనుగోలుచేసి, హవాలా ద్వారా డ బ్బులు తెప్పించుకున్నాడు. ఈనెల 10 న అజీజ్, మొ హమ్మద్ అబ్దుల్ రజాక్, రాఘవ్కౌసర్ లు మావోయి స్టులకు డబ్బులుచేరవేసేందుకు వెళ్తుండగా కాటారం పోలీసులకు చిక్కారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చూపడగా, మహహ్మద్ రవూఫ్, ఆత్రం నారా యణ, మారుపాక రామయ్య, వర్గీస్, భాస్కర్, దిలీప్, ఉంగా, వెల్లాల్ పరారీలో ఉన్నట్లుగా ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో సమర్థవంతంగా పనిచేసిన ఓఎస్టీ అశోక్ కుమార్, కాటారం డీఎస్పీ జి.రామ్మోహన్ రెడ్డి, కాటారం సీఐ రంజిత్ రావు, కాటారం ఎస్సై శ్రీనివాస్, మాహా దేవాపూర్ ఎస్సె రాజకుమార్, కాళేశ్వరం ఎస్సె లక్ష్మణరావు,కొయ్యూరు ఎస్సై నరేష్, అడవి ముత్తారం ఎస్ఐ సుధాకర్ లను ఎస్పీ సురేందర్ రెడ్డి అభినందించారు.