Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
మండలంలోని మొండ్రాయి గ్రామంలోని శ్రీరత్న విద్యాలయానికి చెంది న పస్తం మహేష్ రుక్మాపూర్ సైనిక్ పాఠశాలలో సీటు సాధించారు. శక్రవా రం ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి విద్యార్థిని అభినందించి శాలువాలతో సన్మానం చేసి నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పాటు నందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందించి విద్యార్థులను తీర్చిదిద్దునందుకుగాను శ్రీరత్న పాఠశాల కరస్పాండెంట్ మచ్చిక వెంకటేశ్వర్లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మడత శ్రీనివాస్, పూజారి శ్రీని వాస్, తూర్పాటిస్వామి, సురేష్,కట్లఅశోక్ విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.