Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాటలతో హోరెత్తించిన ప్రముఖ గాయకుడు హేమచంద్ర
నవతెలంగాణ-హసన్పర్తి
మండలంలోని అనంతసాగర్ సుమతిరెడ్డి మహిళా ఇంజనీరిం గ్ కళాశాలలో కల్చరల్ ఫెస్ట్ శ్రీథం-2023 వేడుకలు ఘనంగా జరి గాయి. ప్రోనైట్ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయకుడు వేదాల హేమచంద్ర తాన్ గాత్రముతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. విద్యార్థులు గాయకుడి గాత్రంతో గళం కలిపి నాట్యం చేస్తూ సభికు లను హౌరెత్తించారు. ముందుగా రెండవ రోజు కార్యక్రమాన్ని ఎ స్సార్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రాజశ్రీ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సావనీర్ ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గాయకుడు హేమచంద్ర లైవ్ బాండ్ తో గబ్బర్ సింగ్ పాటను స్టేడియం మొత్తం పవన్ కళ్యాణ్ స్టెప్పులతో హుషారెత్తించారు. ట్రిపుల్ ఆర్ మూవీలోని దోస్త్ సాంగ్ కు బొమ్మాళి బొమ్మాళి అంటే నిన్ను వదల వదల అంటూ కళాశాల ప్రాంగణం మారు మ్రోగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఫ్యాషన్ షోలో మోడ్రన్, సాంప్రదాయ దుస్తులతో ర్యాంపు వాక్ సభికులను ఆకట్టుకుంది. శుక్రవారం రాత్రి సుమతి రెడ్డి కళాశాల ప్రాంగణం విద్యార్థుల, తల్లిదండ్రుల, సిబ్బంది ఆనందోత్సాహాల మధ్య అద్యాంతం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏఓ వేణుగోపాలస్వామి, కన్వీనర్ వేదిక, కొకన్వినర్ శార్వాణి, వివిధ విభాగాధిపతులు డాక్టర్ కె.మహేందర్ రెడ్డి, డాక్టర్ ఈ.సుదర్శన్, డాక్టర్ ఎన్.శ్రీవాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.