Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ వరంగల్ మున్సిపాల్ కా ర్పోరేషన్ పరిధి భీమారంలోని తెలం గాణ హైబ్రీడ్ సీడ్స్ ప్రొడక్షన్, సెల్స్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు ఆ కంపెనీ మేనేజర్‌ను కోరారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు సంబందిత కం పెనీకి ఓ లేఖను అందజేశారు. భీమా రంలోని తెలంగాణ హైబ్రీడ్ సీడ్స్ ప్రొడక్షన్, సేల్స్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ హన్మకొండ మం డలం లష్కర్‌సింగారం శివారు సంబందించిన సర్వే నెం.21 గల స్థలంలో కొంత మంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాత్రి వేళలో కంపెనీకి సంబందించిన ఖాళీస్థలంలో పరదాలు కట్టి నిర్మాణ పనులు చేప డుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. రిజిస్థ్రషన్ నెం.390టి.కె పైన తెలిపిన సర్వే నెం.21లో నిర్మాణం చేపట్టడి ఉన్న పురాతణ సొసైటీ భవనము ముందుస్థలము కరీంనగర్ రోడ్డుకు అనుకోని ఉన్న స్థలములో ఖాళీ స్థలంలో ఎవరికి సంబందం లేని వారు వచ్చి ఖాళీ స్థలములో చుట్టూ గ్రీన్ పరదలు కట్టి రాత్రి పుట ఖాళీ స్థలములో నూతనభవనం కట్టుటకు ప్రయత్నాలు చేపడు తున్న ట్లు తెలిపారు. అట్టి స్థలమును కబ్జాదారుల నుండి కాపా డి తిరిగి రైతులకు ఉపయోగకరంగా సీడ్ కంపెనీ ఏర్పాటుకు కృషి చేయాలని కంపెనీ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.