Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకశిల విద్యాసంస్థల ఇంట సీబీఎస్ఈ ఫలితాల పంట
- కొనసాగుతున్న ఏకశిల విద్యాసంస్థల విజయ పరంపర
నవతెలంగాణ-హసన్పర్తి
శుక్రవారం ప్రకటించిన సీబీఎస్ఈ-2023 ఫలితాలలో ఏకశిల విద్యార్థులు 485, 484, 483, 481 మార్కులు సాధించి ఏకశిల విద్యా సంస్థలు విజయ దుందుభి మోగించినట్లు ఏకశిల విద్యా సంస్థల చైర్మెన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఉన్నతమైన ఆలోచన, నిరంతర శ్రమ, నిర్దిష్టమైన ప్రణాళికతో, అత్యుత్త మైన బోధనతో, క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం మా ఈ విజయాలకు కారణమయ్యాయని తెలిపారు. ఉపాధ్యాయులు బోధనలో అనుసరించే మార్గాలు మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉండాలన్నారు. బోధన తోపాటు సజనాత్మకతను జోడించి తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారానే మా విద్యార్థులు విజయతీరాలకు చేరుతు న్నారని పేర్కొన్నారు. మా విద్యాసంస్థల్లో విద్యను ఆర్థిస్తున్న విద్యార్థుల ప్ర జ్ఞను వెలికి తీసి అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో మేము ముం దు వరుసలో ఉంటామన్నారు. ఈ విద్యా ఫలాలు ప్రతి విద్యార్థి ఉపయో గించుకొని ప్రయోజకులుగా మారాలని సూచించారు. ఈరోజు ఇంతటి ఘన విజయానికి కారణమైన ఉపాధ్యాయులు, విద్యార్థులను, తల్లిదండ్రు లను అభినందించారు. అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన కె. సాయిదీక్షిత్ (485), ఏ.హర్షిత్ (484), ఎం.ఫణికీర్తన్రెడ్డి (483), కె.హారిక (481) మార్కులు సాధించన సందర్భంగా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏకశిలా విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్ రెడ్డి, గౌరు సువిజా రెడ్డి, ప్రిన్సిపల్స్ ఎండి.బాబా, కే.రవికిరణ్, కె.రమేష్ రెడ్డి, సిహెచ్.దినేష్ రెడ్డి, బి.లక్ష్మణ్, కే.బిక్షపతి, జి.ఫణిమోహన్రావు, లవకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఐఐటీ సీటు సాధించడమే లక్ష్యం : కె.సాయి దీక్షిత్
పట్టుదలతో, అత్యుత్తమైన కంటెంట్, పాఠశా ల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల సహకారంతో నేను ఈ విజయం సాధించడం జరిగింది. ఐఐటీ సీటు సాధించడమే లక్ష్యంగా ఇక ముందుకు సాగుతాను.
డాక్టర్ కావాలన్నదే నా ఆశయం : ఎ.హర్షిత్
చక్కని వాతావరణం, మంచి ఉపాధ్యాయ బందం, క్రమశిక్షణాయుతమైన ప్రణాళికతోనే ఈ విజయం సాధించా. ఇంటర్లో బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ సీట్ సాధించడమే లక్ష్యం.
అంతరిక్ష శాస్త్రవేత్త అవడమే లక్ష్యం :
ఎం.ఫణికీర్తన్రెడ్డి
క్రమశిక్షణ నిర్దిష్టమైన ప్రణాళిక, ఉపాధ్యా యుల తల్లిదండ్రుల సహకారం నావిజయానికి కా రణం ఆస్ట్రోనాట్ అవడమే నాలక్ష్యం. ఇందుకు గా ను మా పాఠశాలలో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎంతో దోహద పడింది. కొత్త ఆలోచనలకు పునాది వేసింది.