Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ఆకాలంలో కురిసిన వడగండ్ల వర్షం, గాలి దుమారంకు పంటలు నష్టపోయి న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎఐకేయంఎస్ జిల్లా కార్యదర్శి జి.సక్రు డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన వారికి పక్క గహాలు మంజూ రు చేయాలని,తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దారు వీరన్నకు శుక్రవా రం వినతి పత్రం అందించారు. గాలి దుమారం కారణంగా ఆంగోతండా గ్రామా నికి చెందిన అంగోత్ భీమ్లా, ఆంగోత్ వాణిలకు చెందిన రేకుల ఇల్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని, శేరిపురం, నగరం, బాలాజీ తండా, మర్రిగూడెం గ్రామాల తో పాటు ఇంకా అనేక గ్రామాల్లో కల్లాల్లో ఉన్న వరి ధాన్యం పూర్తిగా తడిసి పో యాయన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నేల రాలిన మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందించిన వారిలో ఏఐకేఎంఎస్ మండల ఉపాధ్యక్షులు మాలోత్ మానియా,నాయకులు భీముడు, భీమ్లా, సురేష్, నరేష్, జగన్ ఉన్నారు.