- టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి యానాల అనంతరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో గుడిసెలు వేసుకున్న పేదలతో పార్టీ నాయకులు జరిపిన సమావేశంలో అనంతరెడ్డి మాట్లాడారు. ఈ స్థలం ఏ ఒక్కరి సొత్తు కాదని ఏ పార్టీ సొంతం కాదని మొదటి నుండి మావోయిస్టులు భూస్వాముల నుండి దీనిని తీసుకొని పేదలకు పంచాలని లక్ష్యంతో పనిచేశారని అన్నారు. ఏ ఒక్క పార్టీ చేసిందని చెప్పుకోవడం కాదని దీనిలో పసర గ్రామస్తులందరూ భాగస్వాము లేనని అన్నారు. గ్రామంలో నిజమైన పేదలందరికీ ఈ భూమిలో ఇల్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని అన్నారు. ఏ ఒక్కరు దీనిపై అజమాయసి చేసిన చెల్లదని నిరుపేదలకు అన్యాయం జరిగితే సహిస్తూ ఊరుకోమని నిజమైన పేదలను గుర్తించి పంపిణీ చేయాలని చేస్తామని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే రెవెన్యూ మరియు పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగిందని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఉపాధి కోల్పోయిన మాజీ మావోయిస్టులకు కు ఉపాధి లేకుండా ఉన్న వారి కుటుంబాలకు కూడా ఇందులో ఇల్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం తరఫున కేటాయించడం జరుగుతుందని అన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు సమసిపోయి పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ధారావతు దేవా నాయక్ మహబూబాద్ టిడిపి పార్లమెంటు క్రియాశీల సభ్యులు నర్రా శివప్రసాద్ గోవిందరావుపేట మండలం అధ్యక్షులు జంపాల సత్యనారాయణ గుడిసేవాసులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 11 May,2023 07:02PM