నవతెలంగాణ - గాంధారి
గాంధారి మండలంలో 30 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు రూ 32, 50,000 /- విలువ గల చెక్కులను పంపిణీచేసిన ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్ చెక్కులు పంపిణీ చేశారు గాంధారి మండలం ముదెల్లి గ్రామ పంచాయితీలో 25 మంది 2BHK లబ్ధిదారులకు రెండో విడతగా రూ.22,50,000/- విలువ గల 25 చెక్కులను ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ పంపిణీ చేశారు. అదేవిధంగా, హేమ్లా నాయక్ తండా గ్రామ పంచాయితీలో 5 మంది 2BHK లబ్ధిదారులకు మొడటి విడతగా రూ.10,00,000/- విలువగల5 చెక్కుల ను పంపిణీ చేశారు. ఈసందర్భం గా ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని కేసీఆర్ ప్రభుత్వంమాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణ జరుగుతుందని అన్నారుఈ కార్యక్రమం లో ఎంపీపీ రాధబలరాం, జడ్పీటీసీ శంకర్ నాయక్, మాజీజడ్పీటీసీ తనాజీరావు, గాంధారి సొసైటీ చెర్మెన్ సాయికుమార్, ముద్దెల్లి సొసైటీ చెర్మెన్ సజ్జన పల్లి సాయిరాం, ముద్దెల్లి సర్పంచ్ పిట్ల కళావతి లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 02:25PM