నవతెలంగాణ - ధర్మసాగర్
విద్యార్థిని విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసేది ప్రభుత్వ జూనియర్ కళాశాలలే అని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎం కప్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యా రంగంలో విన్నూత్నమైన సేవలను ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్ అందిస్తున్నదని అన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మసాగర్ కళాశాలలో చేరండి కరపత్రాన్ని అయన ఆవిష్కరించారు. ప్రతిభగల రెగ్యులర్ అధ్యాపకులతో సాధారణ విద్యార్థులను ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత చెందిస్తున్నారని అన్నారు.ఇంటర్ విద్య తో పోటీ పరీక్షల ఉచిత శిక్షణ,ఉన్నత విద్య కు సహాకారం ఇస్తున్నారని అన్నారు. భారత రక్షణ రంగ సహాయ విభాగంలో యన్ సి సి ఉన్న ఏకైక కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్నారు. కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు ఎన్నో పొందారని గుర్తు చేశారు.కళాశాల మౌలిక సౌకర్యాల కల్పనకు పదిలక్షల రూపాయను మంజూరి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మసాగర్ వేలేరు మండల పౌర సమాజం, ఉపాధ్యాయులు ఒక ఉద్యమంలా విద్యార్థులను తమ కళాశాలలో చేర్చాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో డిసిపి అబ్దుల్, ఎంపిపి కవితా రెడ్డి, సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ చంద్ర, యమ్ పి డి ఓ జవహర్ రెడ్డి, అధ్యాపకులు కనకయ్య, కరుణాకర్ జ్యోతి, బాబురావు, రాములు, గోపాల కృష్ణ, ప్రభాకర్, గణేష్, మంజుల పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:33PM