నవ తెలంగాణ-తాడ్వాయి
కామారెడ్డి నియోజికవర్గంలో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ది నిధుల నుండి 10 కోట్ల రూపాయలు మంజూరైనట్టు మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. ఈ రోజు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంప గోవర్ధన్ మాట్లాడుతూ కామారెడ్డి నియోజికవర్గంలోని గ్రామాల్లో దేవాలయాలకు, కుల సంఘాల భవన నిర్మాణాలకు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రభుత్వ జీ ఓ 3171 ప్రకారం 10 కోట్ల రూపాయలు మంజూరైనట్టు ఆయన తెలిపారు. భిక్కనూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామంలో లో ఓల్టేజ్ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగిన వెంటనే 1 కోటి 84 లక్షల 85 వేల రూపాయలతో 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేసినట్టు వెల్లడించాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కుల సంఘాల భవనాలకు, వివిధ అభివృద్ది పథకాలకు నిధులు తీసుకువచ్చి కామారెడ్డి నియోజీకవర్గ అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ కుమార్, ఎంపిపి ఆంజనేయులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:43PM