- అధికారుల చర్యలు శూన్యం
నవతెలంగాణ-బెజ్జంకి
ఇసుక అక్రమ రవాణదారుల అగడాలకు అధికారులు సైతం తలోగ్గుతున్నారు.దీనికి నిదర్శనం మండల పరిధిలోని తోటపల్లి రిజార్వయర్ సాగు కాల్వ గట్టుపై విచ్ఛలవిడిగా ఇసుక అక్రమ నిల్వలు చేసి ఉన్నాయి.రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడంతోనే రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది.కార్యలయానికే అధికారులు పరిమితమవ్వడం ఇసుక రవాణదారులకు కలిసివస్తోంది.దీంతో గాగీల్లపూర్ గ్రామంలోని ఇసుక అక్రమ రవాణదారుల అగడాలకు అడ్డుకట్ట వేసే అధికారులే లేకపోవడం విశేషం.కార్యలయానికి వచ్చమా?కార్యలయంలో హాజరు వేసుకున్నామా? ఇక పొద్దు గడిస్తే చాలు? ప్రభుత్వ ఉద్యోగిగా ఈ రోజు విధులు నిర్వర్తించాం.. నెల గడిచాక వేతనం దానంతట అదే వస్తుంది..అనే విధంగా నిత్యం ఆలోచన చేసే అసమర్థ అధికారులు మండలంలో ఉండడం వల్లే పరిపాలన కుంటుపడుతుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిద్రావస్థలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు తాము తీసుకుంటున్న వేతనానికనుగుణంగా పనిచేస్తున్నామా? లేదా? పునరాలోచన చేసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.విధుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టి ప్రకృతి ప్రసాదించిన వనరులను సంరక్షించాలని గాగీల్లపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 01:13PM