నవ తెలంగాణ-తాడ్వాయి
కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు రాష్ట్రంలోని జర్నలిస్టుల అందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 18న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు టీ డబ్ల్యూఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల వేణు కోరారు. మంగళవారము జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ మహా ధర్నాకు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకుడు కృష్ణ చారి, అక్రిడేషన్ కమిటీ మెంబర్ కృష్ణమూర్తి, మీడియా కో కన్వీనర్ బాలాజీ, జిల్లా సలహాదారుడు సబ్బాని ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:22PM