నవ తెలంగాణ-కంటేశ్వర్
ప్రయివేటు, కార్పొరేటు పాఠశాల, కళాశాలలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్ లో (ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఏఐఎస్బి, టీవీ యువి, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ... నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్య పేరుతో అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నరాని మండిపడ్డారు. అదే విధంగా తిరుపతయ్య కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కుతూ సంవత్సరానికి కనీసం విద్యాసంస్థలు 5% లాభాలు గడించాలని ఉన్న వాటిని జిల్లా విద్యా అధికారులు సైతం పట్టించుకోకపోవడం విడ్డూరం అని అన్నారు. అదే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో అన్ని విద్యా సంస్థలు తిరుపతయ్య కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒలంపియాడ్, బైజుస్, డీజీ, షాహిన్, లాంటి తోక పేర్లతో ఉన్నటువంటి పాఠశాలలు, శ్రీచైతన్య,నారాయణ కార్పొరేట్ కళాశాలనూ మోసపోవద్దని విద్యార్థులకు, తల్లితండ్రులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ అనిల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రాఘు రామ్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి కర్క గణేష్, ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి, టీవీ యు వి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అష్రఫ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 05:47PM