- సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ - కంటేశ్వర్
ఐకెపి వివో ఏ ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శిను నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ఐకెపి వివో ఏ సమ్మె శిబిరాన్ని సందర్శించి సిఐటియు గా సంఘీభావం తెలపడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరం అవుతాయి అనుకుంటే గ్రేడింగ్ విధానంతో పని భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ రోజు గ్రామాల్లో మహిళలందరిని ముందుకు నడిపించడం,వారికి బ్యాంకు లనుండి అప్పులు, లోన్లు ఇప్పించి వారికి స్వయం ఉపాధి కల్పిస్తూ వారిని ఆర్థికంగా, సామజికంగా అభివృద్ధికి తొడ్పాడే వీవోఏలు అందరు నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబలకు చెందిన వారే ఉన్నారు. అందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ విధానాలు విడనడాలి. ఐకేపీ వీవోఏలు గత 23 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వీవోఏలను పట్టించుకొక పోవడం చాలా దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవాలి. వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. అర్హులైన వీవోఏలను సీసీ లుగా ప్రమోట్ చేయాలని తదితర సమస్యలు పరిష్కరించే విదంగా, ప్రభుత్వం సమ్మె విరామింప చేయాలని లేని యెడల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఈ పోరాటం ద్వారా చెప్తామని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో శంకర్ ఐకెపి వివోఏ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 04:24PM