- ఆ రిజిస్ట్రార్ కు అపాయింట్మెంట్ లేటర్ లేదు
- త్వరలో టీయూ నుండే నూతన రిజిస్ట్రార్ నియామకం
- రిజిస్ట్రార్ నియామకంలో అనవసర రాధ్ధాంతం
- అయోమయంలో సిబ్బంది
- ఈసి సభ్యులు సహకరించాలి
- వైస్ ఛాన్సలర్ రవిందర్
నవతెలంగాణ - డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో ఖిస్స రిజిస్ట్రార్ కుర్చిక ఇంకా సమసి పోలేదు. యూనివర్సిటి లోని రిజిస్ట్రార్ కార్యాలయంగది కి తాళంను సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి తాళం వేయించిన వైస్ ఛాన్సలర్ అనే ప్రచారం జరుగుతోంది.తను తాళం వేయించలేదని, అది రోజు వారిగనే తళం ఉందని, రిజిస్ట్రార్ ఎవరు నియామకం కాక పోవడంతో కార్యాలయం లో పనులు నిలిపివేసామని వైస్ ఛాన్సలర్ రవిందర్ వివరించారు. రిజిస్టర్ గా ప్రొఫెసర్ యాదగిరి బాధ్యతలు స్వీకరించి నాటి నుండి వైస్ ఛాన్సలర్ కు పోసగడం లేదు. ఉదయం యూనివర్సిటీలోని పరిపాలన భవనం లోని రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న ప్రొఫెసర్ యాదగిరి తన గదికి తాళం ఉండడం గమనించి వెంటనే కామర్స్ విభాగం కు వెళ్లిపోయి అక్కడే కూర్చున్నారు. ఉదయమే యూనివర్సిటీకి చేరుకున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యూనివర్సిటీలో జరిగే అన్ని అంశాలపై అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కౌంటర్ సంతకం పెట్టే విధంగా ఆదేశాలు జారీ చేశారు. వైస్ ఛాన్సలర్ కు ముందస్తు సమాచారం లేకుండా ఏలాంటి ఫైలు అనధికార వ్యక్తికి ఇవ్వొద్దని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వైస్ ఛాన్సలర్ రవిందర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ లో రిజిస్ట్రార్ కార్యాలయం గదికి తాళం వేసిన విషయం తెలుసుకున్న విలేకరులు అక్కడికి చేరుకొని వైస్ ఛాన్సలర్ తో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతమున్న రిజిస్ట్రార్ ఎవరో అంతు పట్టడం లేదని, ఈసీ సభ్యులు నియమించిన రిజిస్ట్రార్ కు ఎలాంటి అపాయింట్మెంట్ లెటర్ లేదని ఆయన వివరించారు. రిజిస్ట్రార్ నియామకంలో అనవసర రాధ్ధాఁతం జరిగిందని,ఎవరు రిజిస్ట్రార్ అని తేల లేక నియామకం రద్దు ను హైకోర్టు నిలిపివేసిందని వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు.అందువల్ల రిజిస్ట్రార్ నియామకం అయ్యే వరకు కార్యాలయం కు సీలు వేసి యధావిధిగా పనులు నిర్వహించేందుకు ఏర్పాట్ల చేశామని వైస్ ఛాన్సలర్ రవీందర్ తెలిపారు.రిజిస్ట్రార్ నియామకంలో తెలంగాణ యూనివర్సిటీ ఈ.సీ.కమిటీ సహకరించి యునివర్సిటీ అభివృద్ధి కి కృషి చేయ్యాలని కోరారు.ఉస్మానియా యునివర్సిటీ నుండి నియమించిన రిజిస్ట్రార్ ను భయ భ్రాంతులకు గురి చెయడంతో నియామకమయిన రిజిస్ట్రార్ ప్రోఫేసర్ డాక్టర్.నిర్మలాదేవి తిరిగి ఉస్మానియా యునివర్సిటీ కీ వెళ్లి పోయారన్నారు. ప్రస్తుతనికి తెలంగాణ యూనివర్సిటీ లోనే అనుభవజ్ఞులైన ఒక ప్రోఫేసర్ ను నూతన రిజిస్ట్రార్ గా యునివర్సిటీ ఈ.సి.కమిటీ సభ్యుల నిర్ణయంతో నియామకం జరుపుతామన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కి తాను విధులు నిర్వహించిన నాటి నుండి కృషి చేస్తున్నానని, కావాలని నా పై ఎవరో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ గుప్తా అన్నారు.
తెలంగాణ యునివర్సిటీ లో అనేక అభివృద్ధి పనులు జరిగేవి ఉన్నందున అభివృద్ధికి ఆటంకం కలుగకుండా తాను యునివర్సిటీ లో సిబ్బంది సహకారంతో పనులు చేస్తున్నామని అన్నారు.ఇంకా అభివృద్ధి లో భాగంగా 20కోట్ల రుపాయల రూసా నిధులు వెనక్కి వెళ్లాయని, యునివర్సిటీ పరిపాలన సౌలభ్యం కోసం ఇంకా 39మంది సెక్యూరిటీ గార్డులు, ఇతర నాన్ టీచింగ్ ఔట్ సోర్సింగ్ స్థాఫ్ నియామకం చేయనున్నట్లు ఇందుకు గాను యునివర్సిటీ అభివృద్ధినీ కోరుకొనే ఈసి కమిటీ సభ్యులు పూర్తి గా సహకరించాలని తెలిపారు. ఈనెల 17న యూనివర్సిటీ స్టాఫ్ తో సమావేశం నిర్వహించి ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఆగిన ఒక సెమిస్టర్‌ను పూర్తి చేయడానికి, యూనివర్సిటీ లో ఈ నేలా 18 నుండి తరగతులు ప్రారంభం కావడానికి సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ఈనెల 25న హైదరాబాద్‌లోని రూసా లో జరిగే యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి వైస్ ఛాన్సలర్ గా తను హాజరు కావడం లేదని, జూన్ 1న తెలంగాణ యూనివర్సిటీలోనే తను ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహిస్తానని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. రిజిస్టర్ వైస్ ఛాన్స్లర్ మధ్య కుర్చీ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ దుమరాన్ని లేపుతుంది. వాయిస్ ఛాన్స్లర్ మాత్రం పట్టిన పట్టును విడిచేది లే అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు యూనివర్సిటీలో నేలకోని ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 07:12PM