నవతెలంగాణ - కోహెడ
మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన మౌటం వీరయ్య (35) ఆదివారం సైకిల్‌పై వస్తున్న క్రమంలో హుస్నాబాద్ నుండి సిద్ధిపేట వైపుగా వెళ్తున్న బోదాసు రవి తన మోటర్ సైకిల్‌తో వేగంగా ఢీ కొట్టడంతో మృతి చెందాడు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం వీరయ్య తన వ్యవసాయ పనులు ముగించుకొని సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా పాలకేంద్రం సమీపంలో అటుగా వేగంగా వస్తున్న టీఎస్ 36 జె 8359 గల ద్విచక్ర వాహనం అతడిని ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తుండగా రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు మౌటం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:24PM