నవతెలంగాణ - నవీపేట్: గ్రామీణ ప్రాంతాల్లో యువ క్రీడాకాలను ప్రోత్సహించడమే సీఎం కప్ లక్ష్యమని ఎంపీపీ సంగెం శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం వాలీబాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని సీఎం కప్ క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడల వైపు ఆకర్షితులను చేసి భవిష్యత్తులో మంచి క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయిలలో రాణించేలా కృషి చేసేందుకు ఈ క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. క్రీడలతో మానసిక ఉత్సాహంతో పాటు శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని ప్రతి ఒక్కరు క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వీర్ సింగ్ ఎంపీడీవో సాజిద్ అలీ, బిఆర్ఎస్ నాయకులు బుచ్చన్న, ఎంపీటీసీలు మీనా నవీన్ రాజ్, రాధా, ఎంపీఓ రామకృష్ణ, ఏపిఎం భువనేశ్వర్ గౌడ్, ఏపిఓ రాజేశ్వర్, పిఈటిలు రవి, నాయక్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm