నవతెలంగాణ - ఆర్మూర్
నిజామాబాద్ పోలిస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం* వారి ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ స్టేషన్ పరిధి లోనీ ఆర్మూర్ బస్టాండ్, పెర్కిట్ బస్టాండ్* లో ఆటో డ్రైవర్ లకు మై ఆటో ఈజ్ సేఫ్టీ పైన అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్స్ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆటోలను నడపరాద నీ. ఆటోలకు క్యూ ఆర్ కోడ్ కచ్చితంగా అతికించి ఉండాల నీ మద్యం సేవించి ఆటోలు నడపరాద నీ రాంగ్ రూట్లో ప్రయాణించరాదు అతి వేగంగా ఆటోలను నడపరాదు.మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించి ఆటో డ్రైవర్లు ఎలాంటి మాదక ద్రవ్యాలకు గంజాయికి బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు గంజాయినీ సాగు చేసిన, వినియోగించిన, విక్రయించిన, సరఫరా చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును గంజాయినీ నిర్మూలిద్దా యువత భవిష్యత్తును కాపాడుదం ట్రాఫిక్ నియమాలు గురించి వివరించి, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపరాదని వివరించారు. డయల్ 100 గురించి వివరించి అత్యవసరసమయంలో డయల్ 100 ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు, పోలీస్ కళాబృందం సిబ్బంది ఆటో డ్రైవర్స్ పాల్గొన్నారు.