నవతెలంగాణ - బెజ్జంకి
మండల పరిధిలోని గూడెం గ్రామంలో పీఏసీఎస్ అద్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ దేవ రాజశ్రీ మంగళవారం ప్రారంభించారు. నియమాలను పాటిస్తూ రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ దేవ శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ సభ్యులు, పీఏసీఎస్ సిబ్బంది, గ్రామ రైతులు హజరయ్యారు.