నవతెలంగాణ - కంటేశ్వర్
బహుజన కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మారోజు వీరన్న 24వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద వీరన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. హైదరాబాదులో జరిగే వీరన్న రాష్ట్రస్థాయి వర్ధంతి సభకు జిల్లా కార్యదర్శి దేవరాజు మల్లికార్జున్ నాయకత్వంలో బీసీపీ బృందం బయలుదేరింది. ఈ సందర్భంగా బహుజన కమ్యూనిస్టు పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి దేవరాజు మల్లికార్జున్ మాట్లాడుతూ.. కామ్రేడ్ మారోజు వీరన్న మార్క్సిజo కు జ్యోతిభా ఫూలే,అంబేద్కర్ సిద్ధాంతాన్ని జోడించి భారత దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన జరగాలంటే కులవర్గా జంట జమిలి పోరాటాలను నిర్మించాలని సిద్ధాంతికరించాడు.చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించాడు. పేద ప్రజల హక్కుల కోసం, అణగారిన కులాల హక్కుల కోసం, కుల అస్తిత్వ సంఘాలను నిర్మాణం చేశాడు. కులారాజాధికార సభలను ఏర్పాటు చేశాడు. ప్రజలను ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తున్నా వీరన్నను నరహంతకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్కౌంటర్ పేరిట హత్య చేసింది.నేడు కేంద్రంలోని బిజెపి సర్కార్ దేశమంతా హిందూమతం పేరిట అల్లకల్లోలాలు సృష్టించాలని ప్రజల మధ్య వైశామ్యాలు పెంచే విధంగా తమ పాలనను ఉదృతం చేసింది. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి హిందుత్వ జపం చేస్తున్నారు. పాలకులు కార్మికులను అణిచివేయడానికి లేబర్ చట్టాలకు సవరణలు చేసి నల్ల చట్టాలను తీసుకువచ్చారు. కోటి ఉద్యోగాల హామీని గాలికి వదిలేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా భూములను అమ్ముకుంటూ తమ ఆస్తులను పెంచుకుంటున్నారు. ఉచితల పేరిట ప్రజల ఆస్తులను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ భృతి నీటి మీద మాటలయ్యాయి. మరోవైపు ప్రశ్నించే వ్యక్తులను తన పోలీసు యంత్రాంగం ద్వారా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మారోజు వీరన్న ఆశయాన్ని ఆయన అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని కులవర్గ జంట జమిలి పోరాటాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ నాయకులు జి.రమేష్ కంకణాల సిద్ధిరాములు గంగన్న, నతనియల్, సుధాకర్ గోపి యాదవ్, దండం పోషన్న డి. కర్ణాకర్, యాటరాజు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 03:27PM