- హుస్నాబాద్ సిఐ ఎర్రల్ల కిరణ్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలలో బాల కార్మికులతో పనిచేయించవద్దని హుస్నాబాద్ సిఐ కిరణ్ అవగాహన కల్పించారు. ఆదివారం హుస్నాబాద్ సీఐ కిరణ్, ఎస్ఐ మహేష్ డి సి పి ఓ అధికారులతో కలసి ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న బాల కార్మికుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పరిచయం లేని వ్యక్తులతో పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు. పిల్లలను హుస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి విద్యనభ్యాసంచే విధంగా కృషి చేయాలని తెలిపారు. మహిళల పిల్లలకు రక్షణకు ఉన్న చట్టాల గురించి వివరించారు. బాల కార్మికులతో పని చేయించవద్దని సంబంధిత ఇటుక బట్టీల యజమానులకు సూచించారు.