నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమని ఆ దేశ సుప్రీం కోర్టు పేర్కొంది. ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో మంగళవారం ఆర్మీ రేంజర్లు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని తెలిపింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను తమ కస్టడీ నుంచి విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం అక్రమాస్తుల నిరోధక సంస్థను ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm