- సర్వీస్ రోడ్డు కోసం నిరసన...
- 10 సర్పంచ్లు ఎన్ హెచ్ అదికారులకు మోర పేట్టుకున్న స్పందించరా...
నవతెలంగాణ డిచ్ పల్లి
గాల్లో దీపంలా ప్రజల విలువైన ప్రాణాలు పోతున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పట్టించుకోరా అని, జాతీయ రహదారి పొడిగింపు సమయం నుండి నేటి వరకు సర్వీస్ రోడ్డు కోసం విన్నవిస్తూనే ఉన్న పెడచెవిన పెడుతూ ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేశారని, గతం నుండి నేటి వరకు సమీప 10 గ్రామాలకు చెందిన10 సర్పంచ్లు ఎన్ హెచ్ అదికారులకు మోర పేట్టుకున్న ఇప్పటి వరకు స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తు జాతీయ రహదారిపై గురువారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సర్పంచులు పానుగంటి రూప సతీష్ రెడ్డి ,వెంకటేష్, నర్సయ్య, లు మాట్లాడుతూ డిచ్ పల్లి మండలంలోని జాతీయ రహదారి 44 సీఎంసీ మెడికల్ కాలేజీ నుండి నుండి యానం పల్లి రోడ్డు వరకు జాతీయ రహదారి వెంబడి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని చుట్టూ ప్రక్కల 10 గ్రామాల నుండి తరలివచ్చిన గ్రామ ప్రజలు సీఎంసీ వద్ద 44 జాతీయ రహదారిపై రాస్తారోకో చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.వెంటనే సర్వీస్ రోడ్డు ఇరువైపులా ఏర్పాటు చేయాలని వారందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.14 సంవత్సరాల కాలంలో 50, మందికిపైగా మృత్యువాత పడ్డారని, వందలాది మంది ఇప్పటి వరకు క్షతగాత్రులు అయ్యారని వాపోయారు. ఎప్పటినుంచో సర్వీస్ రోడ్డు కోసం ప్రయత్నం చేసి వచ్చిన అధికారులకు వినతి పత్రాలను అందజేయడం ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడల్లా సమీప గ్రామాల ప్రజలు రహదారిపై ధర్నాలు నిరసన వ్యక్తం చేసినప్పుడు అధికారులు రావడం ప్రజలకు మాయమాటలు చెప్పి వెళ్లిపోవడం జరుగుతుంది కానీ ప్రజల విలువైన ప్రాణాలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అన్ని వినతి పత్రాలు ఇచ్చిన ప్రయోజనం శూన్యమన్నారు. కనీసం తాత్కాలిక రోడ్డు వేయాలని 10 గ్రామల సర్పంచ్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులను కోరారు. ప్రతినిత్యం వందలాల వాహనాలు డిచ్ పల్లి రాకపోకలు సాగిస్తూ ఉంటాయని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ రహదారి ఉందన్నారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కల్పించుకొని సీఎంసీ వద్ద ప్లై ఓవర్ నిర్మించినప్పుడే రోడ్డు ప్రమాదలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు 10 గ్రామాలకు చెందిన బాధితులు, ప్రజలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 11 May,2023 07:11PM