నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని మొండాలతోగు సమీపంలో సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీడీఏ (డి డబ్ల్యూ డబ్ల్యూ) ఎలక్ట్రిషన్ ఎండి అలీముద్దీన్(56) మృతి చెందాడు. డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్(57) తీవ్రంగా గాయాల పాలయ్యన సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో ఎండి అలీముద్దీన్ (ఎలక్ట్రిషన్) ఐటిడిఏ జీప్ డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్ లు ఇరువురు కలిసి ఏటూర్ నాగారం నుండి ఆఫీస్ పని నిమిత్తం ఏపీ 36 కే 4610 నెంబర్ గల కమాండర్ జీబు పై హన్మకొండ కు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తున్న క్రమంలో పస్రా, తాడ్వాయి మధ్యలో మొండాల తోగు వద్దకు చేరుకోగానే అతివేగంగా వస్తున్న జీవు ఎదురుగా వస్తున్న టిప్పర్ను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఎలక్ట్రిషన్ ఎండి అలీముద్దీన్, డ్రైవర్ శ్రీనివాస్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఇరువురిని108 లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఐటీడీఏ ఎలక్ట్రిషన్ ఎండి అలీముద్దీన్ మృతి చెందాడు. డ్రైవర్ శ్రీనివాస్ తీవ్ర గాయాల పాలయి చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ప్రమాదానికి గురైన డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 11 May,2023 08:16PM