- ఎమ్మెల్యే సీతక్క
నవ తెలంగాణ-గోవిందరావుపేట
గత పాత పద్ధతి ప్రకారం చెల్లించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రాజెక్ట్ నగర్ మోట్లగూడెం గ్రామాలలో ఎమ్మెల్యే సీతక్క పర్యటించి తునికాకు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా అటవీ ప్రాంతంలోఉండే ప్రజలు ఎండాకాలం లో తూనికాకు సేకరనే ప్రధానమైన జీవనాధారం గా జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో కొత్తగా అన్ లైన్ విధానం ద్వారా తుణికాకు సేకరణ డబ్బులు చెల్లిస్తాం అని అటవీ శాఖ అధికారులు అనడం తో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లు లేని పరిస్థితి ఒక వేళ ఉన్న దానిలో చాలా మందికి డబ్బులు పడని దుస్థితి ఇలాంటి విధానం మానుకొని ప్రభుత్వం,మరియు సంబంధిత అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా పాత పద్ధతి ద్వారా నే డబ్బులు నేరుగా థునికాకు సేకరణ డబ్బులు ఇవ్వాలని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్, సర్పంచ్ సమ్మయ్య తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 05:55PM