- గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి..
- పూర్తి సహకారం అందజేస్త..
- ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ డిచ్ పల్లి: యానంపల్లికి 3.65లక్షల రూపాయలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ఇంకా మిగిలిన పనులకు గాను పూర్తి సహాయ సహకారం అందజేస్తానని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.శుక్రవారం డిచ్ పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 23 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల విలువ 23,02,668 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ బిజెపి నాయకులు నోరు తెరిస్తే అబద్ధంగా మాట్లాడుతరని, గల్లీలో ఉండే బిజెపి నాయకులు కేంద్రం నుండి రూపాయి తెచ్చే ముఖం లేదు కానీ, ప్రొద్దున లేస్తే గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు,గ్రామాలకు చేసింది ఏమీ లేదన్నారు.స్థానికంగా గెలిచిన నిజామాబాద్ ఎంపీ యానం పల్లి గ్రామానికి ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు.అ యాంటి కి ఏడాదికి 5 కోట్ల ఎంపీ ఫండ్ వస్తుందని, నాలుగు ఏళ్ల నుండి, ఏ ఒక్క గ్రామానికి అయినా రూపాయి ఇచ్చిన ముఖం లేదని దుయ్యబట్టారు.బిజెపి ప్రభుత్వం దేశానికి ₹.100 లక్షల అప్పు చేసిందని, ఆదానీ కి అంబానీకి దేశ సంపదను కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు వారికి అమ్ముతూ దేశాన్ని అప్పుల మయంగా మార్చిన ఘనత బిజెపి ప్రభుత్వానికే చెల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పేదల సంక్షేమ ప్రభుత్వం, ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ప్రతి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని వివరించారు. ఆసరా, బీడీ పింఛన్, కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి, రైతుబంధు, రైతు బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు, దేశంలో ఏ ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.యానంపల్లి గ్రామానికి 3.65లక్షల రూపాయలతో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, యానంపల్లి గ్రామంలో శ్రీ నవదుర్గా (పెద్దమ్మ) మందిర విగ్రహ ప్రతిష్టాపన, సిసి రోడ్లు, వివిధ కుల సంఘ భవనాల ప్రారంభోత్సవం, డ్రైనేజీ లు, రైతు వేదిక భవనము, తెలంగాణ విలేజ్ పార్క్, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్దన్ గారు, మరియు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జెడ్పీటీసీ జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గారు. యానంపల్లి గ్రామంలో శ్రీ నవదుర్గా (పెద్దమ్మ) మందిర విగ్రహ ప్రతిష్టాపన, మరియు సిసి రోడ్లు, వివిధ కుల సంఘ భవనాల ప్రారంభోత్సవం, డ్రైనేజీ లు, రైతు వేదిక భవనము మరియు తెలంగాణ విలేజ్ పార్క్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు, ధర్పల్లి జెడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మండల అధ్యక్షులు చింత శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షులు శక్కరి కోండ కృష్ణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు పద్మారావు, గొపు గంగాధర్, ఎంపిటిసి అప్పల మంజుల గణేష్, ఉప సర్పంచ్ పల్లికొండ ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షులు ఒసా సంతోష్ , వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘ నాయకులు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 07:22PM