నవతెలంగాణ - మాక్లూర్
మండలంలోని చిన్నపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శాంతభాయ్ (65) గురువారం రాత్రి పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ శుక్రవారం తెలిపారు పోలీసుల కథనం ప్రకారం గురువారం రాత్రి ఉక్కపోతగ ఉండటంతో అరుబయట పడుకుంటాను అని ఇంట్లో వాళ్లకు చెప్పి బయట నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు కట్ల పాము కాటు వేయడంతో ఇంట్లో వాళ్ళు వచ్చి పామును చంపి ఉదయం 3గంటల సమయంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 9గంటలకు చనిపోవడం జరిగిందన్నారు. మృతురాలి కుమారుడు కుమ్మరి ముత్తన్న పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరిగౌడ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 07:32PM