నవ తెలంగాణ - సిద్దిపేట
సీబీఎస్ఈ బోర్డు ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో మెరీడియన్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీబీఎస్ఈ అఫీలియేషన్ సాధించిన మొదటి సంవత్సరంలోనే 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల మెరీడియన్ పాఠశాల. మొత్తం 20 మంది విద్యార్థులకు గాను 20 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్స్ రాజేందర్ రెడ్డి, సౌజన్యలు మాట్లాడుతూ నిరంతర శ్రమ, సరైన ప్రణాళికలు ,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన, విద్యార్థులకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం వల్లనే ఉత్తమ ఫలితాలు సాధించామని తెలిపారు. కొన్ని పాఠశాలలకు సీబీఎస్ఈ రికగ్నైజేషన్ లేకున్నా సీబీఎస్ఈ పేరుతో పాఠశాలను నడుపుతున్నారన్నారు. కాబట్టి తల్లిదండ్రులు సీబీఎస్ఈ రికగ్నైజేషన్ ఉన్న పాఠశాలలోనే పిల్లల్ని చేర్పించగలరని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు దేవేందర్ రెడ్డి, రాజా వెంకటరెడ్డి , ఉపాధ్యాయులు అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 07:53PM