- సభను జయప్రదం చేయండి
- బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్
నవతెలంగాణ కంటేశ్వర్
సామాజిక న్యాయ సాధన కోసం ఉద్యమించిన కుల వర్గ సైద్ధాంతిక యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న 23వ వర్ధంతి సభను మే 16న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లోనిర్వహిస్తున్నట్లు బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి కార్యాలయంలో బహుజన కమ్యూనిస్టు పార్టీ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల కార్యదర్శి డి.మల్లఖర్జున్ , బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి జిల్లా కన్వీనర్ కె.మధులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం బిజెపి, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు బహుజన ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు.
కామ్రేడ్ మారోజు వీరన్న సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం కేవలం ఆర్థిక పోరాటాలు చేసి కుల నిర్మూల పోరాటాలు చేయని కారణంగానే ఈరోజు కుల వ్యవస్థ, మతోన్మాదం బలోపేతం అవుతుందన్నారు.
23 సంవత్సరాల క్రితం కామ్రేడ్ మారోజు వీరన్న ప్రతిపాదించిన సామాజిక న్యాయం గురించి అన్ని కమ్యూనిస్టు పార్టీల నుండి బిజెపి కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నాయని అన్నారు. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫూలే, అంబేద్కర్, కమ్యునిస్టుల సమైక్య ఉద్యమమే కామ్రేడ్ మారోజు వీరన్న కు నిజమై నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి నగర కన్వీనర్ హైమద్ హుస్సేన్, కె.రాజు, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకులు సిద్దిరాములు, నతానియల్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 07:56PM