నవతెలంగాణ కంఠేశ్వర్
సిబిఎస్ సి నిర్వహించిన 2022- 23 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నగరంలోని నవ్యభారతి పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని పాఠశాల చైర్మన్ ప్రిన్సిపల్ క్యాతం సంతోష్ కుమార్ క్యాతం శ్రీదేవిలు తెలిపారు. గత సంవత్సరాలుగా 100% ఫలితాలు సాధించినందుకు గర్వంగా ఉందని వారు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు 500 మార్కులకు గాను 400 పైచిలుకు మార్కులు 8 మంది విద్యార్థులు సాధించాలని అందులో రియన్ష్ రెడ్డి (469/500), ఫాతిమా సన(438/500) , లోహిత్ అక్షయ్ రెడ్డి(436/500), అలీషా (424/500),, రేణుక సురేంద్ర (420, మానన్సి(412/500) ఉదితి గుప్తా(410/500), రిషిత్ గుప్తా(409/500) లు మార్కులు సాధించారని వారు తెలిపారు. ఈ ఉత్తమ ఫలితాలకు సహకరించిన తమ పాఠశాల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.