నవతెలంగాణ-గోవిందరావుపేట
నేటి సమాజంలో యువత స్వయం ఉపాధికై చిన్న చిన్న వ్యాపారాల్లో ప్రతిపత్రం రాణించాలని పసర ఎస్సై సిహెచ్ కరుణాకర రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో మేడారం వెళ్లే రహదారిలో హనుమాన్ ఆటో కన్సల్టెన్సీ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై కరుణాకర్ రావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన యువకులందరూ ఆర్థికంగా ఎదుగుదల కోసం ఎన్నో రకాలైన చిన్నచిన్న వ్యాపారాలను స్వయం ఉపాధిగా ఎంచుకొని రాణించాలని సూచించారు. రాకేష్ ఆటో కన్సల్టెన్సీ తో ఎందరికో ఉపాధి చూపించవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పసర ఆటో యూనియన్ నాయకులు, భూక్య అంజిబాబు, చల్ల శ్రీనివాస్, అశోక్ సురేష్, రఫీక్, కాళీ, సెల్వం రతన్ సింగ్, సిద్దు ,ఫెరోజ్, సర్వర్, నారాయణ, ప్రకాష్, శేఖర్, మేడారం ఆటో యూనియన్ నాయకులు, ఓనర్లు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 08:53PM