నవతెలంగాణ కంఠేశ్వర్
గత సంవత్సరం తేది: 09-9-2022 రోజున ఎస్.కె. భాషా, ఎ.ఎస్.ఐ, సిరికొండ పి.యస్ గారు రోడ్డు ప్రమాదం జరిగి ,చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రూపంలో గల చెక్కు రూ॥ 5,00,000/- ( ఐదు లక్షల రూపాయల చెక్కును శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్ చేతుల మీదుగా కీ॥ శే॥ ఎస్.కె. భాషా సతీమణి అయిన గౌసియా బేగం కి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) జి. మధుసుదన్ రావు, నిజామాబాద్ పరిపాలన అధికారి ( ఎ.ఓ ) బి. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఆఫీస్ సూపరింటెండెంటు మక్సూద్ హైమద్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, భద్రతా సెక్షన్ ఇంచార్జీ పి. రాజేశ్వర్ వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 09:07PM