నవతెలంగాణ - కంటేశ్వర్
రాహుల్ గాంధీ భారత్ జూడో లక్ష్యం నెరవేరే దిశగా మొదట హిమాచల్ ప్రదేశ్ లో ,రెండోది కర్ణాటకలో అడుగులు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికలన్నింటిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది.మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చీకటి మిత్రులైన మోడీ కేసీఆర్లకు కచ్చితంగా తెలంగాణ ప్రజలు కర్ణాటకలో ఇచ్చిన తీర్పును పునరావృతం చేస్తారు. అక్కడ 40% కమిషన్ ప్రభుత్వాన్ని దించి వేసిన కన్నడ ప్రజలు ,అదేవిధంగా తెలంగాణలో 30% కమిషన్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా దించేస్తారు. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపడంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అవినీతి ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుండి పారదోలాల్సిందిగా జిల్లా ప్రజలకు సూచించారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మల్లికార్జున్ కార్గే, సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, డికె శివకుమార్, సిద్ధిరామయ్య లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.