నవతెలంగాణ -నవీపేట్: కర్ణాటక రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం టపాకాయలు పేల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపి అత్యధిక స్థానాలు ఇచ్చారని భవిష్యత్తులో సైతం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు సైతం బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, వడ్డే రవి, లక్ష్మణ్, మూస, సబీర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm