నవతెలంగాణ - హైదరాబాద్: ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో జూబ్లీహిల్స్ లోని మోతీనగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో మోతీనగర్ ల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. కానీ, విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. ఈ తరుణలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించేందుకు సంఘటన ప్రదేశానికి జీహెచ్ఎంసీ అధికారులుతో పాటు భారీగా పోలీసులను మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుట్రపూరితంగా ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తున్నారంటూ స్థానిక టీడీపీ నేతలు ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm