నవతెలంగాణ - కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలోగల వినాయక్ నగర్ పరిధిలో ఓ ప్రైవేట్ టీచర్ అదృశ్యమైనట్లు నిజామాబాద్ నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఎస్ఐ సందీప్ కుమార్ వివరాల ప్రకారం.. తన భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందని ఫిర్యాదుదారుడు అంగార్ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చిన దరఖాస్తు పరంగా అతని భార్య అయిన అంగారి విజయలక్ష్మి వయస్సు 41 సo, ఒక ప్రవేటు స్కూల్లో టీజర్ గా పనిచేస్తుందని అని తెలిపారని ఎస్ఐ తెలిపారు. తేది 12.05-2023 న తన డ్యూటీ ముగించుకొని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిందని తెలియజేశారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తిరిగి వెళ్లిందని అప్పటినుండి ఎక్కడికి వెళ్లిందో తెలియదని కుటుంబ సభ్యులు తెలియజేశారు. సాయంత్రం తర్వాత ఇంటికి తిరిగి రాలేదని తన భర్తతోపాటు కుటుంబ సభ్యులు అనగా అదృశ్యమైన తల్లి వారి కుటుంబ సభ్యులు ఎంత వచ్చినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో నాల్గవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోటోలో ఉన్న మహిళను ఎవరైనా గుర్తిస్తే నాలుగో పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్ లేదా డయల్ వందకు లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని ఎస్సై పేర్కొన్నారు. అదృష్టమైన విజయలక్ష్మి ఫోటోను గుర్తిస్తే తప్పనిసరిగా సమాచారం అందించాలని నిజామాబాద్ నగర ప్రజలను కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 03:11PM