నవతెలంగాణ - కంటేశ్వర్
గ్రామపంచాయతీ జేఏసీ జిల్లా సదస్సు మే 23న జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ రాష్ట్ర జేఏసీ.కన్వీనర్ దాసు ( ఐ ఎఫ్ టి యు) కోరారు. ఈ మేరకు ఆదివారం
గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 2023 మే 23న నిజాంబాద్ నగరంలోని సిఐటియు ఆఫీసులో ఉమ్మడి జిల్లా సదస్సు ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ రాష్ట్ర జేఏసీ.కన్వీనర్ దాసు ( ఐ ఎఫ్ టి యు) నిజాంబాద్ లోని సిఐటియు ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి దాసు ఐఎఫ్టియుదాసు మాట్లాడుతూ రాష్ట్రంలో 12 769 గ్రామపంచాయతీలో సుమారు 50 వేల మంది పనిచేస్తున్నారని, అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో యెట్టి చాకిరి చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని వెంటనే జీవో నెంబర్ 60 ప్రకారం 19 వేల రూపాయలు వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మే డే సందర్భంగా వెయ్యి రూపాయల వేతనం పెంచినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, కార్మికులు హక్కులు సాధించుకున్న రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ జీవో 60 ప్రకారం వెంటనే 15 వేల రూపాయలు అమలు చేస్తే బాగుండేదని ఆయన అన్నారు. జీవో నెంబర్ 51 సవరించాలని మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వివిధ కేటగిరీలన్నిటిని యధావిధంగా కొనసాగించాలని దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కార్మికులకు పీఎఫ్ ,ఈఎస్ఐ ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని విధి నిర్వహణలో మరణించిన సిబ్బందికి 10 లక్షల నష్టపరియారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని కార్మిక ,సిబ్బందిని అక్రమంగా తొలగించడం, వేధించడం వెంటనే ఆపాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
వివిధ పంచాయతీలో ప్రజా అవసరాల కోసం నియమించిన కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి కాజా మొయినుద్దీన్, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్, ఇందూరు రాజయ్య సిఐటియు. నాయకులు జంగం గంగాధర్, సాగర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 03:55PM