నవతెలంగాణ - గోవిందరావుపేట
మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం ఐదు గంటల నుండి అభిషేకాలు హోమం పూజారి కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్విరామంగా నిర్వహించారు. పూజా కార్యక్రమలను ఆలయ గిరిజన పూజారి బిజ్జ నాగేంద్రం వేద మంత్రోపచ్చారణల మధ్య భక్తి పరవశంతో నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన సూర్నేని విజయ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించగ హనుమాన్ స్వాములు భక్తి భజనలతో పాటలు పాడారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 04:57PM