నవతెలంగాణ - డిచ్ పల్లి
వీవోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి,తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వేంటనే నెరవేర్చాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయించడంలో అహర్నిశలు శ్రమిస్తమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ వివోఏ ఇందల్ వాయి మండల అధ్యక్షురాలు కె సరళ, ప్రధాన కార్యదర్శి కె. రాము అన్నారు.తమ డిమాండ్ల సాధనకై సమ్మె ఆదివారం 21 వరోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకేపీ వీఓఏలకు ప్రభుత్వం భరోసా కల్పించాడం లో మినమేషలు లేక్కిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాక పోవడంతో గత్యంతరం లేక రోడ్లపై సమ్మె చేయక తప్పడం లేదన్నారు. గతంలో అనేక సందర్భాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు చేసినప్పుడు అనాడు ప్రభుత్వం దృష్టికి తాము ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకెళ్ళమని అనాడు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఇచ్చిన హామీ నేరవేరలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా వివోఏల సమస్య లను సానుకుల దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనాలు నెలకు రూ.18 వేలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం, అర్హులైన వారందరికీ సీసీలుగా నియమించాలని, యూనిఫామ్ కేటాయించాలని, ప్రమాద బీమా సౌకర్యం రూ. 10 లక్షల కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని వారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సువర్ణ, కోశాధికారి మమతా,సభ్యులు కవిత,
సౌమ్య, అరుణ, స్వప్న, అలేఖ్య, రాధికా, లావణ్య, భాగ్య, మౌనిక తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 05:01PM